Pooja Hegde: వాళ్లది మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ..

Pooja Hegde: తన ఫస్ట్ క్రష్ గురించి చెబుతున్న పూజా హెగ్డే

Dhatripriya
Published on: 15 Feb 2023 2:16 PM IST
Pooja Hegde Says Their Love Is Only Pure Love
X

Pooja Hegde: వాళ్లది మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజ హెగ్డే పేరు ముందే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈమె చేస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతున్నప్పటికీ పూజా హెగ్డే పై ఉన్న క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రేమ కథ గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ పూజ హెగ్డే.

తన అందమైన నవ్వుతో, కొంటె చూపుతో ఎంతోమంది యువతను ఇట్టే ప్రేమలో పడేసిన పూజా హెగ్డే మొదటిసారిగా ప్రేమలో పడింది తన అమ్మానాన్నలతో అట. "వాళ్లది ఎంతో స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రేమ కేవలం తల్లిదండ్రుల నుంచి మాత్రమే వస్తుంది. ఆ ప్రేమని మనం ఎప్పటికీ మర్చిపోలేము. జీవితాంతం కొనసాగే గొప్ప ప్రేమ అది," అని చెబుతోంది పూజ హెగ్డే. "మధ్యలో ఎన్నిరకాల ప్రేమలు పుట్టుకొచ్చినా కూడా అవి కలకాలం ఉంటాయని నేను నమ్మను," అంటోంది పూజ.

"నా మొదటి క్రష్ నా స్కూల్ టీచర్ పై ఉండేది. అతనెవరు అన్నది మాత్రం చెప్పను. ఇప్పటివరకూ చాలా మంది అడిగారు కానీ నేను చెప్పలేదు. నా స్నేహుతుల్లో కొందరికి మాత్రమే అది తెలుసు. ఆ క్రష్ చాలా కాలం కొనసాగింది," అని అంటోంది పూజ హెగ్డే. ఇక తరగతిలో అంతమంది అబ్బాయిలు ఉండగా టీచర్ తోనే ఎలా ప్రేమలో పడ్డారని అడగక దానికి తన దగ్గర సమాధానం లేదని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇంకా ప్రస్తుతానికి మాత్రం తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని ప్రేమ కోసం కేటాయించి అంత సమయం మరియు ఆసక్తి తన దగ్గర లేవని చెబుతోంది. సినిమాల పరంగా చూస్తే, సల్మాన్ ఖాన్ సరసన 'కీసీకా భాయ్ కీసీ కా జాన్' లో నటిస్తున్న పూజా హెగ్డే సూపర్ స్టార్ మహష్ సరసన 'ఎస్ ఎస్ ఎంబీ 28'లోనూ నటిస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story