Pooja Hegde: అలాంటి పాత్ర కావాలి అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: అలాంటి పాత్ర కావాలి అంటున్న పూజా హెగ్డే

admin1
Published on: 1 Dec 2021 10:21 AM IST
Pooja Hegde Says she has to do Movies Like Wonder Woman
X

పూజ హెగ్డే (ఫైల్ ఇమేజ్)

Pooja Hegde: ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ భామ. ఈ మధ్యనే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాతో మరొక మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే తనకు ఎలాంటి పాత్రలు చేయాలి ఉంది అని అడగగా హాలీవుడ్ సినిమా అయినా వండర్ వుమెన్ వంటి సినిమాలలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో తన స్టాండ్ కమెడియన్ పాత్ర బాగా క్లిక్ అయింది ఆని, కమర్షియల్ సినిమాల్లో అయినా సరే అలాంటి వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్లు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. అయితే తెలుగులో ఆమె "వండర్ ఉమెన్" వంటి పాత్ర దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఫిమేల్ సెంట్రిక్ పాత్రలు మాత్రం పూజ హెగ్డే ఒప్పుకునే లానే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే నయనతార వంటి హీరోయిన్ల లాగా పూజా హెగ్డే కూడా తనకంటూ ఒక మార్క్ ను ఇండస్ట్రీలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన "రాధేశ్యామ్" సినిమా లో కూడా తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

admin1

admin1

Next Story