Pooja Hegde:"మహారాణి గాయత్రి దేవి పాత్ర చేయాలని ఉంది" అంటున్న పూజా హెగ్డే

* రాజమాత పాత్రలో కనిపించాలనుకుంటున్న పూజా హెగ్డే

admin1
Updated on: 19 Oct 2021 4:30 PM IST
Pooja Hegde Says Maharani Gayatri Devi is My Dream Role
X

రాజమాత పాత్రలో కనిపించాలనుకుంటున్న పూజా హెగ్డే(ట్విట్టర్ ఫోటో)

Pooja Hegde: "అల వైకుంఠపురం లో" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మరొక హిట్ ను అందుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న పూజా హెగ్డే ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూజా హెగ్డే తన డ్రీమ్ పాత్ర గురించి చెప్పింది. కూచ్ బెహర్‌లో రాకుమారి గాయత్రీదేవి పాత్రలో పూజాహెగ్డే వెండితెరపై వెలగాలని ఆశిస్తోందట.

జైపూర్ మహారాజు సవాయ్ మాన్సింగ్ 2 భార్య అయిన మహా రాణి గాయత్రి దేవి పార్లమెంటులో సైతం పనిచేశారు. 12 ఏళ్ల పాటు పార్లమెంట్ లో పనిచేసిన మహారాణి గాయత్రి దేవి ఆ తరువాత రాజకీయాలకి దూరంగా సాదాసీదా జీవితాన్ని గడిపారు. మరి జైపూర్ రాజ్యానికి రాజమాతగా కొనియాడబడిన మహారాణి గాయత్రీ దేవి పాత్రలో కనిపించే అవకాశం పూజా హెగ్డే కి దొరుకుతుందో లేదో చూడాలి. మరోవైపు పూజాహెగ్డే "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా "ఆచార్య" సినిమాలో కూడా పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

admin1

admin1

Next Story