Pooja Hegde - Chiranjeevi: మెగాస్టార్ తో సినిమా కల అంటున్న స్టార్ హీరోయిన్

Pooja Hegde: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఇ

admin1
Published on: 7 Sept 2021 12:15 PM IST
Pooja Hegde Says Its a Dream Come True to Act With Megastar Chiranjeevi in Acharya Movie
X

మెగాస్టార్ చిరంజీవి అండ్ పూజ హెగ్డే (ఫైల్ ఇమేజ్)

Pooja Hegde - Megastar Chiranjeevi: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఇటు తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల నుంచి కూడా మంచి ఆఫర్లను అందుకుంటోంది. తాజాగా పూజాహెగ్డే మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" లో రామ్ చరణ్ తో జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడుతూ పూజా హెగ్డే కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. "ఆచార్య" లాంటి సినిమాలో తనకి ఒక పాత్ర దక్కటం తనకు కల నిజం అవడం లాంటిదని మెగాస్టార్ తో సినిమా చేయాలని కల ఎట్టకేలకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా తీరబోతోంది అని వ్యక్తం చేసింది పూజ.

"చాలామందిక లాగా నాకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తితో నేను ఒకే స్క్రీన్ పై కనిపించటం చాలా సంతోషంగా ఉంది" అని స్పష్టం చేసింది పూజా హెగ్డే. ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో కనిపించబోతున్న పూజా హెగ్డే మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్" సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. తెలుగులో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా కూడా చేస్తున్న పూజా హెగ్డే హిందీలో "సర్కస్" మరియు తమిళ్ సినిమా "బీస్ట్" షూటింగులతో కూడా బిజీగా ఉంది.

admin1

admin1

Next Story