పూజా అవుట్.. రష్మిక ఇన్..

Thalapathy Vijay: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Arun Chilukuri
Updated on: 13 April 2022 6:30 PM IST
Pooja Hegde Replaced By Rashmika Mandanna in Thalapathy 66 Movie
X

పూజా హెగ్డే స్థానంలో వచ్చిన రష్మిక మందన్న

Thalapathy Vijay: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఇక ఇప్పుడు విజయ్ ఒక తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తలపతి 66 అని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ముందుగా పూజా హెగ్డే ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ సినిమా లో అప్పటికే పూజా హెగ్డే విజయ్ తో రొమాన్స్ చేసింది. అందుకని ఈ సినిమా కోసం రష్మిక మందన్న ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా "ఆచార్య" సినిమాతో బిజీగా ఉంది. అంతేకాకుండా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story