Pooja Hegde: కాంచన 4లో ఫస్ట్ టైం ఓ సాహసం చేయబోతున్న పూజా హెగ్డే

లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న కాంచన 4లో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇందులో పూజా ఫస్ట్ టైం ఓ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Vijaya Laxmi
Published on: 28 Feb 2025 4:31 PM IST
Pooja Hegde Joins Kanchana-4 With a Challenging Role
X

కాంచన 4లో ఫస్ట్ టైం ఓ సాహసం చేయబోతున్న పూజా హెగ్డే

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. గత కొంతకాలంగా అరకొర సినిమాలతో సతమతమవుతున్న పూజాకు వరుస అవకాశాలు వచ్చాయి. సూర్యతో రెట్రో, లారెన్స్‌తో కాంచన 4 లాంటి సినిమాలను చేస్తుంది. అయితే కాంచన 4కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న కాంచన 4లో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇందులో పూజా ఫస్ట్ టైం ఓ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో పూజా డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఆమె పాత్ర పల్లెటూరి అమ్మాయిగా ఉంటుందని టాక్. డీ గ్లామర్ రోల్‌లో ఫుల్ మాస్‌గా కనిపించబోతుంది పూజా. గంగ సినిమాలో నిత్యామీనన్ పాత్రకంటే డీ గ్లామర్ గా పూజా పాత్ర ఉండబోతోందని సమాచారం.

అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతిగా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని సమాచారం. కాంచన 4 సినిమాలో పూజా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహీ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.

ప్రస్తుతం పూజా సూర్యతో రెట్రో, విజయ్ సరసన జన నాయగన్, కాంచన 4 చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు రజనీకాంత్ కూలీ సినిమాలోనూ పూజా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

Vijaya Laxmi

Vijaya Laxmi

Next Story