Pooja Hegde: అందుకే ముంబై లో ఇల్లు కొన్న పూజా హెగ్డే

Pooja Hegde: అందుకే ముంబై లో ఇల్లు కొన్న పూజా హెగ్డే

admin1
Updated on: 15 Feb 2022 3:20 PM IST
Pooja Hegde is the Reason to Buy a House in Mumbai | Tollywood News
X

Pooja Hegde: అందుకే ముంబై లో ఇల్లు కొన్న పూజా హెగ్డే 

Pooja Hegde: వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ చిత్రాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. తాజాగా ఈ భామ స్వస్థలమైన ముంబైలో ఒక పెద్ద ఇంటిని కనుక్కుంది. ఈ మధ్యనే ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉండే పూజ హెగ్డే హైదరాబాద్లోనే ఉంటోంది. కానీ ఇల్లు మాత్రం ముంబైలో ఎందుకు కొనుక్కోవడం అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది పూజా హెగ్డే.

"నేను నా కుటుంబానికి చాలా దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను. వాళ్ళు ముంబై లో ఉంటారు కాబట్టి నేను అక్కడ ఇల్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఇక ముంబైలో ఉన్నప్పుడు తనకి ఎప్పుడు ఇంట్లో వండిన ఆహారం దొరుకుతుందని చెప్పింది ఈ భామ. కరోనా కారణంగా గృహప్రవేశానికి ఎక్కువమందిని పిలవలేదని, "ఇది నా జీవితంలోని చాలా పర్సనల్ మరియు స్పెషల్ మూమెంట్. అందుకే ఎక్కువ మందిని పిలవలేదు," అని చెప్పుకొచ్చింది పూజా. ఇక సినిమాల పరంగా చూస్తే "ఆచార్య" మరియు "రాధే శ్యామ్" సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తోంది పూజా హెగ్డే.

admin1

admin1

Next Story