Pooja Hegde: పూజ హెగ్డే కి బాగా తగ్గిపోయిన ఆఫర్లు

Pooja Hegde: మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న పూజ హెగ్డే

Dhatripriya
Updated on: 4 Feb 2023 7:30 PM IST
Pooja Hegde Is Not Geting Offers
X

Pooja Hegde: పూజ హెగ్డే కి బాగా తగ్గిపోయిన ఆఫర్లు

Pooja Hegde: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా #SSMB28. "అతడు", "ఖలేజా" తర్వాత వీరిద్దరి కాంబో లో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళింది. తొలి షూటింగ్ షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయింది. ఇక ఈ నెలాఖరున సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ కూడా మొదలు కానుంది. ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం పూజా హెగ్డే తన సోదరుడి పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంది. దీంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయింది. తాజాగా మొదలు కాబోతున్న కొత్త షెడ్యూల్ లో మాత్రం పూజ కూడా పాలుపంచుకోబోతోంది. మరోవైపు గత ఏడాది పూజ హెగ్డే కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్, మరియు సర్కస్ సినిమాలలో నటించిన పూజ హెగ్డే ఒక్క సినిమా తో కూడా ప్రేక్షకులను అలరించ లేకపోయింది. దీంతో ఈమె మార్కెట్ కూడా బాగానే దెబ్బతింది.

ఇక ఈ ఏడాది విడుదల కాబోతున్న సినిమాల పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది పూజ హెగ్డే. మళ్ళీ తన కెరీర్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి పూజ ఇప్పుడు పెద్ద ప్లాన్లు వేస్తుందట. కానీ #SSMB28 తర్వాత పూజ హెగ్డే మరే సినిమాకి సైన్ చేయలేదు. హిందీ లో "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్" అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తున్న పూజ హెగ్డే కి పెద్దగా ఆఫర్లు కూడా రావట్లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో మంచి ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని పూజ హెగ్డే కూడా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story