Pooja Hegde: ఇద్దరు డైరెక్టర్ల కారణంగా సేఫ్ జోన్ లో ఉన్న పూజా హెగ్డే

Pooja Hegde: ఇద్దరు డైరెక్టర్ల కారణంగా సేఫ్ జోన్ లో ఉన్న పూజా హెగ్డే

Dhatripriya
Updated on: 29 March 2023 8:31 PM IST
Pooja Hegde Is In Safe Zone Because Of Two Directors
X

Pooja Hegde: స్టార్ డైరెక్టర్ ల బ్యాకప్ వల్ల సేఫ్ గా ఉన్న పూజ హెగ్డే 

Pooja Hegde: ఎంత గొప్ప నటీనటులు అయినా కరియర్లో ఎత్తు పల్లాలు చాలా సహజం. ఎలాంటి ఇండస్ట్రీ లో ఏళ్ల తరబడి ఒకేలాంటి స్టార్ డం మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న అనుష్క, కాజల్, తమన్నా, లు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయి పెద్ద సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి యువ హీరోయిన్లు ఇండస్ట్రీలో వారి స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నారు. ఇక పెద్ద సినిమాలకు అయితే చాలా మంది దర్శక నిర్మాతలు బాలీవుడ్ భామలను తీసుకొని వస్తున్నారు.

ప్రజెంట్ జనరేషన్ లో శ్రీ లీల వంటి యువ హీరోయిన్లు మంచి ఆఫర్లు అందుకుంటున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత అంతగా లేకపోవడంతో ఆఫర్లు తగ్గిపోతున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పూజ హెగ్డే చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హరీష్ శంకర్ ల కారణంగా పూజా హెగ్డే ఇప్పుడు బాగానే బిజీగా ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #ఎస్ఎస్ఎంబీ28 సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భగత్ సింగ్ సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్గా అనుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు స్టార్ హీరోయిన్ల ట్యాగ్ ఉన్నప్పటికీ రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ లక్కీ ఇలాంటి బ్యాకప్ లేదు అని చెప్పుకోవాలి. "దసరా"సినిమా రిజల్ట్ పైన కీర్తి సురేష్ కెరియర్ ఆధారపడి ఉండగా "యానిమల్", "పుష్ప 2" సినిమాల మీద రష్మిక మందన్న కెరియర్ ఆధారపడి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story