Pooja Hegde New Movie: భారీ చిత్రాలతో ఫుల్ బిజీ!

Pooja Hegde New Movie: పూజా హెగ్డే.. స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది.

Venkata Chari
Published on: 12 April 2021 5:24 PM IST
Pooja Hegde Full Busy With Big Project Movies in Tollywood | Pooja Hegde New Movie
X

పూజా హెగ్డే (ఫొటో: ది హన్స్ ఇండియా)

Pooja Hegde New Movie: పూజా హెగ్డే.. స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంటున్న ఈ నటి... ప్రస్తుతం చాలా బిజీగా మారింది. 'ఆచార్య', 'రాధే శ్యామ్‌', 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', 'కభీ ఈద్‌.. కభీ దీవాళి', 'సర్కస్‌' లాంటి భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా తమిళ్ హీరో విజయ్ సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకుంది పూజా హెగ్డే. నిర్మాతలకు ఈ హీరోయిన్ డేట్స దొరకడం చాలా కష్టంగా మారిందంటే... ఎంత బిజీగా ఉందో అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే.. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న సినిమాలోనూ పూజా హెగ్డే పేరు చక్కర్లు కొడుతోంది. కాగా, 'ఆచార్య' మే 13న, 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' జూన్‌ 19న, 'రాధేశ్యామ్‌' జులై 30న విడుదల కానున్నాయి. కరోనా ప్రభావంతో ఈ సినిమాలు వాయిదా పడతాయో లేదు చూడాలి. ఈ సినమాలు రిలీజ్ అయితే ఈ ఇయర్‌ టాలీవుడ్ లో హీరోయిన్‌ పూజా హెగ్డే దే హవా కొనసాగుతుంది.

Venkata Chari

Venkata Chari

Next Story