కరోనా వల్ల గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న పూజా హెగ్డే

Pooja Hegde First Choice for Sita Ramam Movie
x

కరోనా వల్ల గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న పూజా హెగ్డే

Highlights

Pooja Hegde: "మహానటి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్...

Pooja Hegde: "మహానటి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఇప్పుడు "సీతారామం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న మరియు తరుణ్ భాస్కర్ లు ఈ సినిమా లో ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న థియేటర్లలో విడుదల అయ్యింది. తాజాగా సినిమా హీరోయిన్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమాలో సీత పాత్ర పోషించిన మృణాల్ ఠాకూర్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ముందుగా ఒక స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట.

ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజ హెగ్డే. ముందుగా ఈ సినిమాలో సీత అంటే హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే నీ సంప్రదించారు డైరెక్టర్ హను రాఘవపూడి. కానీ అప్పుడు పూజా హెగ్డే కరోనాతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేయలేక అదే సమయంలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలా కరోనా కారణంగా పూజ హెగ్డే చేతుల్లోంచి ఒక సూపర్ హిట్ సినిమా చేయి జారిపోయింది అన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories