ఇల్లు కట్టడమే కష్టమైంది పెళ్ళంటే ఇంకెలా ఉంటుందో అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: పెళ్లి పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చిన పూజా హెగ్డే

admin1
Published on: 8 Dec 2021 3:06 PM IST
Pooja Hegde Expresses her Opinion on Marriage
X

పెళ్లి పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చిన పూజా హెగ్డే (ఫైల్-ఫోటో)

Pooja Hegde: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఇప్పటికే పూజా హెగ్డే నటిస్తున్న చాలా స్టార్ హీరో సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ భామ.

పెళ్లి పై తన అభిప్రాయం ఏంటి అని అడగగా పూజా హెగ్డే ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. "ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు పెద్దలు ఎందుకంటే అవి చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది" అని అంటోంది పూజా హెగ్డే.

"ఈ మధ్యనే ముంబైలో ఒక ఇంటిని నిర్మించుకున్నాను. ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టం అయింది. ఇంక పెళ్లి ఎలా ఉంటుందో" అని నవ్వేసింది పూజ. జీవితాంతం అతనితో కలిసి ఉంటే బాగుంటుంది అనిపించే వారిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పిన పూజా హెగ్డే ఇంట్లో ఒత్తిడి వల్ల కానీ అందరూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అని కానీ తను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదని తెలిపారు.

ప్రస్తుతానికి అయితే పెళ్లి ఆలోచన లేదని, సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన "రాధేశ్యామ్" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా లో కూడా పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story