Pooja Hegde: "దాంతో ఆ కల నెరవేరింది" అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: "ఇన్నాళ్ల నా కల ప్రభాస్ వాళ్ళ నెరవేరింది" అంటున్న పూజ హెగ్డే

admin1
Updated on: 11 Jan 2022 8:00 PM IST
Pooja Hegde Comments on Radhe Shyam Movie | Tollywood Movie News
X

 "దాంతో ఆ కల నెరవేరింది" అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ పెరుగుతున్న కరోనా కేసు ల వల్ల "ఆర్ ఆర్ ఆర్" తో పాటు ఈ సినిమా కు వాయిదా పడింది. యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పూజా హెగ్డే సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇక ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ రొటీన్ స్టోరీలకి భిన్నంగా ఒక సరికొత్త లవ్స్టోరీ చేయాలనే కల తనకి ఎప్పటినుంచో ఉన్నట్లు చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. "నేను ఎప్పటి నుంచో ఒక సరికొత్త జోనర్ లో ప్రేమకథ చేయాలని కలలు కంటూ ఉన్నాను. ప్రభాస్ రాధే శ్యామ్ తో ఈ కల నెరవేరింది" అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతుంది సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story