Pooja Hegde: ఒక్క పాట కోసం అంత డిమాండ్ చేసిన పూజ

Pooja Hegde: ఒక్క పాట కోసం అంత డిమాండ్ చేసిన పూజ

admin1
Updated on: 11 April 2022 10:00 PM IST
Pooja Hegde asked for a remuneration of crores for a Single Song
X

Pooja Hegde: ఒక్క పాట కోసం అంత డిమాండ్ చేసిన పూజ

Pooja Hegde: పూజ హెగ్డే, ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, పూజ హెగ్డే పై ఉన్న క్రేజ్ మాత్రం ఈ మాత్రం తగ్గలేదు. ఒకవైపు హీరోయిన్గా మాత్రమేకాక మరోవైపు ఐటమ్ సాంగుల తో కూడా పూజా హెగ్డే ఈమధ్య ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో "జిగేలురాణి" ఐటెం సాంగ్ లో కనిపించిన పూజా హెగ్డే ఇప్పుడు మరొక సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

"ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" అనే సినిమా కి సీక్వెల్ గా "ఎఫ్ 3" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డే ని సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పిందట. అయితే తే.గీ ఈ ఒక్క పాట కోసం ఆమె ఏకంగా వన్ పాయింట్ ఫైవ్ కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ దర్శక నిర్మాతలు ఆ రెమ్యునరేషన్ కి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ డీల్ను కోటి రూపాయలకు క్లోజ్ చేశారు దర్శక నిర్మాతలు. కేవలం ఒక్క ఐటం సాంగ్ కోసమే కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటూ పూజా హెగ్డే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు పూజాహెగ్డే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

admin1

admin1

Next Story