Trivikram - NTR 30: "హస్తినకు" సిద్దంకాని పూజా హెగ్డే

Sandeep Reddy
Updated on: 19 July 2021 4:06 PM IST
Pooja Hegde as a Heroine yet to Confirm For  Trivikram NTR30 Hasthinaku Movie | NTR 30 Movie Update
X

"హస్తినకు" మూవీ పోస్టర్ -  పూజా హెగ్డే 

Trivikram - NTR 30: "అజ్ఞాతవాసి" సినిమా డిజాస్టర్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా "అరవింద సమేత", అల్లు అర్జున్ "అల వైకుంఠపురం" చిత్రాల సూపర్ హిట్లతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ "అయ్యప్పన్ కోషియమ్" చిత్రానికి మాటలను అందించనున్నాడు. ఇక గతంలోనే ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో "అయినను పోయి రావాలె హస్తినకు" సినిమాని అధికారికంగా ప్రకటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్, హారిక హాసిని బ్యానర్ లో నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు కరోన కారణంగా సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అవడంతో త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కలేదు.

అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ తన "అరవింద సమేత", "అల వైకుంఠపురం" చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికకి సంబంధించి చిత్ర యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ నుండి అధికారికంగా రానున్నాయని సినీ వర్గాల నుండి సమాచారం. అయితే తాజా సమాచారంతో అరవింద సమేతగా ఉండి, అల వైకుంఠపురం వెళ్ళిన పూజా హెగ్డే త్రివిక్రమ్ హస్తినకి ఇంకా సిద్దం అవలేదనే తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story