Pooja Hegde: "టాలీవుడ్ లో ఈ మార్పు చాలా సంతోషంగా ఉంది" అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది...

Shireesha
Updated on: 12 March 2022 3:01 PM IST
Pooja Hegde Appreciating Tollywood Industry for Strong Female Roles | Tollywood News
X

Pooja Hegde: "టాలీవుడ్ లో ఈ మార్పు చాలా సంతోషంగా ఉంది" అంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా పూజా హెగ్డే మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక చిత్ర ప్రమోషన్స్ తో కూడా ఈ భామ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండియన్ సినిమాల పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది పూజా. సౌత్ ఇండియా లో డైరెక్టర్లు అందరూ స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్లు ఉండేలా చూస్తున్నారని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

"ఒక అమ్మాయి గా సీత ఔర్ గీత సినిమాలో హేమమాలిని గూండాలను కొట్టినప్పుడు, గాల్ గాడట్ వండర్ ఊమెన్ గా చేసినప్పుడు, మిస్టర్ అండ్ మిసెస్ లో ఏంజలీనా జోలీ మంచి యాక్షన్ సన్నివేశాలు చేసినప్పుడు చాలా సంతోష పడే దాన్ని. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్లను ఎప్పుడు నాకు నచ్చేవి. ఏదో ఒకరోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సినిమా చేయాలని నా కోరిక. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక మంచి చేంజ్ గా చెప్పవచ్చు" అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఇక మరోవైపు పూజా హెగ్డే బీస్ట్, ఆచార్య సినిమాలలో మాత్రమే కాకుండా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కూడా నటించనుంది.

Shireesha

Shireesha

Next Story