సరికొత్త రికార్డ్ సృష్టించిన "పొన్నియిన్ సెల్వన్"

ponniyin selvan created a new record
x

సరికొత్త రికార్డ్ సృష్టించిన "పొన్నియిన్ సెల్వన్"

Highlights

* 2022లో అతి భారీ కలెక్షన్లు నమోదు చేసిన తమిళ్ సినిమాగా ఈ చిత్రం రికార్డును సృష్టించింది

Ponniyin Selvan: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా టాలీవుడ్ స్టార్ నటీనటులతో "పొన్నియిన్ సెల్వన్" భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి రెండవ భాగమైన "పొన్నియిన్ సెల్వన్: 2" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో "పొన్నియిన్ సెల్వన్ 1" బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 400 కోట్ల గ్రోస్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఇప్పుడు తమిళనాడులో ఒక రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

2022లో అతి భారీ కలెక్షన్లు నమోదు చేసిన తమిళ్ సినిమాగా ఈ చిత్రం రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా ఇంత భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న నాలుగవ సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో 15వ స్థానాన్ని సంపాదించింది. మరి "పొన్నియిన్ సెల్వన్ 2" ఎన్ని రికార్డులు సృష్టిస్తోందో అని వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చోళులు మరియు పాండ్యుల మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, జయం రవి, విక్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories