Ponniyin Selvan Collection: రెండో రోజు న మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

Ponniyin Selvan Collection: రెండో రోజు న మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

Rama Rao
Published on: 2 Oct 2022 3:44 PM IST
Ponniyin Selvan 1 Movie Box Office Collection | Movie News
X

Ponniyin Selvan Collection: రెండో రోజు న మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

Ponniyin Selvan Collection: తమిళ ప్రేక్షకులందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన సినిమా "పొన్నియిన్ సెల్వన్". స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ "బాహుబలి" అని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ఆర్ శరత్ కుమార్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలలో కనిపించారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ సెప్టెంబర్ 30 న విడుదల అయ్యింది. కానీ విడుదలైన రెండో రోజు నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ ను అందుకుంది.

అయితే సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. రెండో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రెండో రోజునే 85 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుంది. నిజానికి ఇది రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. రెండో రోజున 75 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకున్న మొట్టమొదటి తమిళ్ సినిమాగా "పొన్నియిన్ సెల్వన్" రికార్డ్ సృష్టించింది. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం మరియు సుభస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

ఏరియా వైస్ గా "పొన్నియిన్ సెల్వన్" రెండో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

తమిళ్ నాడు: 47 కోట్ల గ్రాస్

కేరళ: 6 కోట్లు

కర్ణాటక: 5.5 కోట్ల గ్రాస్

రెస్ట్ ఆఫ్ ఇండియా: 4 కోట్లు

డొమెస్టిక్ గ్రాస్: 46 కోట్లు

ఓవర్సీస్: 5 మిలియన్ డాలర్లు

ప్రపచవ్యాప్తంగా: 85 కోట్లు

Rama Rao

Rama Rao

Next Story