logo
సినిమా

Puneeth Rajkumar: పునీత్‌ మరణం తీరని లోటు.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Politicians and Celebrities Condolences to Puneeth Rajkumar Death
X

పునీత్ రాజ్ కుమార్ కు పలువురు ప్రముఖుల సంతాపం (ఫైల్ ఇమేజ్)

Highlights

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్‌వుడ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్‌వుడ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్రలోటు అని పలువురు సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. పునీత్‌ మరణవార్త విని అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు.

సినీ హీరో రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కి గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు.

హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది- బోనీ కపూర్

అత్యంత స్నేహశీలి.. ఆప్తుడు..సహృదయుడు - దుల్కర్ సల్మాన్

వినయ విధేయతలకు పెట్టింది పేరు.. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - మహేష్ బాబు

నమ్మలేని వార్త ఇది.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి...పునీత్ ఆత్మకు శాంతి కలగాలి- విశాల్

పునీత్ చిన్న వయసులో మరణించడం విచారకరం..హృదయాన్నిమెలిపెట్టే వార్త ఇది- కోన వెంకట్

మంచి స్నేహ శీలి.. సహృదయుడు.. మంచి మనిషి - నిక్కీ గల్రానీ

చాలా చిన్న వయసులో మరణించడం బాధాకరం.. కన్నడ సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు- ప్రియాంక జవాల్కర్

జీర్ణించుకోలేని దుర్వార్త... పునీత్ లేడని నమ్మలేకపోతున్నాను- రాధిక

ఊహించని వార్త.. పునీత్ ఆత్మకు శాంతి కలగాలి- సురేష్ గోపీ

దురదృష్టకరం...పునీత్ అభిమానులకు, కుటుంబానికి నా సంతాపం - వరుణ్ తేజ్

పునీత్ మరణ వార్త నమ్మలేకపోతున్నాను..- మంచు విష్ణు

అప్పు మృతి తీరని లోటు- ప్రకాష్ రాజ్

Web TitlePoliticians and Celebrities Condolences to Puneeth Rajkumar Death
Next Story