MAA Elections 2021: ప్రకాష్‌రాజ్‌కు టీఆర్ఎస్.. మంచు విష్ణుకి వైసీపీ మద్దతు..?

MAA Elections 2021: లోకల్ నాన్ లోకల్ మసకబారిన ప్రతిష్ట మహిళా అధ్యక్షురాలే కావాలి అది కూడ ఏకగ్రీవమవ్వాలి అంటు..

Arun Chilukuri
Published on: 2 July 2021 2:23 PM IST
Political Parties Enter in MAA Elections 2021
X

ప్రకాష్‌రాజ్‌కు టీఆర్ఎస్.. మంచు విష్ణుకి వైసీపీ మద్దతు..?

MAA Elections 2021: లోకల్ నాన్ లోకల్ మసకబారిన ప్రతిష్ట మహిళా అధ్యక్షురాలే కావాలి అది కూడ ఏకగ్రీవమవ్వాలి అంటు అనేక అంశాల చుట్టు తిరుగుతున్న మూవీ ఆర్టీస్ట్‌ అసోషియేషన్‌కు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఒకో ఫ్యానల్‌కి ఒక్కొ రాజకీయ పార్టీ సపోర్ట్‌ ఉందని ప్రచారాలు జరుగుతున్నాయి.

మూవీ ఆర్టీస్ట్‌ అసోషియేషన్‌లోకి ఇప్పుడు పొలిటీకల్ పార్టీలు ఎంటర్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 900 మంది సభ్యులు ఉన్న మా అసోసియేషన్‌లో ఏ ఫ్యానల్ అయిన గెలవాలంటే తప్పకుండ పొలిటీకల్ పార్టీల మద్దతు వుండాలసిందే. ప్రకాష్‌రాజ్‌కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు మంచు విష్ణుకి వైసీపీ, సీవిఎల్ నరసిం‍హారావుకు బీజేపీ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి.

ఇక ఏపీ మా తెలంగా‍ణ మా అనే మాటలు కూడా ఈ మధ్య వినపడుతున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ మా అసోసియేషన్ స్థాపించి ఉండడంతో మళ్ళీ దాని గురించి డిస్కస్‌ నడుస్తుండటం ఏపీ మా అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే మా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే వివాదాస్పదమవుతున్న అసోసియేషన్ ను సక్రమ పద్దతిలో నడపాలంటే పెద్దలందరు ఏకం అయి ప్యానల్స్‌ని రద్దు చేసి మహిళ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవం చేయడానికి ముందుకు రావాలంటు కోరుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు దగ్గర సంబంధం ఉన్నమాట వాస్తవమే అయినా మా ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టడం బాధకరం.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story