Puneeth Rajkumar: పునీత్ డాక్టర్ కి సెక్యూరిటీ ఇస్తున్న పోలీసులు

Puneeth Rajkumar: పునీత్ డాక్టర్ కి భద్రత కల్పించిన పోలీసులు

admin1
Updated on: 8 Nov 2021 5:50 PM IST
Police Security to Puneeth Family Doctor Venkata Ramana
X

పునీత్ రాజ్ కుమార్ డాక్టర్ కు రక్షణ కల్పిస్తున్న పోలీసులు (ఫైల్ ఇమేజ్)

Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో పునీత్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, పునీత్ ప్రాణాలు కపడలేకపోయారు డాక్టర్లు. చికిత్స పొందుతూ పునీత్ కాలం చేశారు. దీంతో పునీత్ అభిమానులు ఆయన ఫ్యామిలీ డాక్టర్‌ రమణ రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పునీత్ మృతి చెందారని, ఆయన అభిమానులు బెంగుళూరులోని సదాశివనగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (PHANA) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైద్యులపై ఇలాంటి ఆరోపణలు సమంజసం కాదని వాదిస్తోంది. ఆ అభిమానులపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసన్న కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మయిని కూడా కోరారు. పునీత్‌కు సరైన వైద్యం అందించారని, కానీ ఆయన చనిపోవడం దురదృష్టకరం అయినప్పటికీ, డాక్టర్ ల తప్పు కాదని అన్నారు. దీంతో పోలీసులు డాక్టర్ వెంకట రమణ ఇంటి వద్ద భద్రత పెంచారు. సదాశివనగర్‌లో నివసించే డాక్టర్ ఇంటి వద్ద మరియు క్లీనిక్ వద్ద క్కుడా ఇప్పుడు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

admin1

admin1

Next Story