కరాటే కల్యాణి ఆచూకీ కోసం గాలింపు.. వారే కల్యాణిని కిడ్నాప్ చేశారని..

Karate Kalyani: కరాటే కల్యాణి కోసం ఛైల్డ్‌లైన్ అధికారుల ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri
Published on: 16 May 2022 3:02 PM IST
Police Searching For Karate Kalyani
X

కరాటే కల్యాణి ఆచూకీ కోసం గాలింపు.. వారే కల్యాణిని కిడ్నాప్ చేశారని..

Karate Kalyani: కరాటే కల్యాణి కోసం ఛైల్డ్‌లైన్ అధికారుల ఆరా తీస్తున్నారు. కల్యాణి వద్ద ఉన్న పాప వివరాలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉండగా కరాటే కల్యాణి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరాటే కల్యాణి ఎక్కడుందో తమకు తెలియదంటున్నారు తల్లి విజయలక్ష్మి. శ్రీకాంత్‌రెడ్డి తన కుమార్తెను కిడ్నాప్ చేసి ఉంటాడని విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. నిన్నటి నుండి కరాటే కల్యాణి ఫోన్‌ స్విచ్చాఫ్ వస్తుందని పాప దత్తత విషయంలో పూర్తి వివరాలు కల్యాణికి మాత్రమే తెలుసన్న తల్లి ఇటీవల కల్యాణికి చాలా మందితో విరోధం ఏర్పడిందని వారే కల్యాణిని కిడ్నాప్ చేశారని భావిస్తున్నానన్నారు. కల్యాణి మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారామె.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story