ఎట్టకేలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పర్మిషన్ సంపాదించిన వీర సింహారెడ్డి బృందం

* వీర సింహారెడ్డి ఈవెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు

Dhatripriya
Published on: 5 Jan 2023 3:29 PM IST
Police Gave Green Signal To Veera Simha Reddy Event
X

వీర సింహారెడ్డి ఈవెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు

Veera Simha Reddy: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు "వీర సింహా రెడ్డి" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరవ తేదీన ఒంగోలులో ఏబీఎన్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ పోలీసులు మాత్రం సెక్యూరిటీ రీజన్స్ కారణంగా దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన తొక్కిసలాట తర్వాత పోలీసులు ఎక్కువమంది వచ్చే ఈవెంట్లకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం చాలా రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ను పెట్టి పోలీసులు వీరసింహారెడ్డి రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే నిర్వాహకులు ఒంగోలు బైపాస్ రోడ్డు దగ్గర బీఎంఆర్ (అర్జున్ ఇన్ఫ్రా) మహానాడు గ్రౌండ్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు రేపు ఒంగోలులోని ఈవెంట్ కి హాజరవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ తో పాటు మిగతా నటీనటులు కూడా ఈ ఈవెంట్ కి విచ్చేయనున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మించారు.

Dhatripriya

Dhatripriya

Next Story