Nayanthara - Vignesh Shivan: నయనతార విగ్నేష్ శివన్ పై కేసు నమోదు

Nayanthara - Vignesh Shivan: గత కొంతకాలంగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే...

Shireesha
Published on: 25 March 2022 2:27 PM IST
Police Case Filed on Nayanthara Vignesh Shivan about Rowdy Pictures Production Company | Live News
X

Nayanthara - Vignesh Shivan: నయనతార విగ్నేష్ శివన్ పై కేసు నమోదు 

Nayanthara - Vignesh Shivan: గత కొంతకాలంగా ప్రముఖ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే తన నుదుటి మీద సింధూరం తో కనిపించిన నయనతార తాము పెళ్లి కూడా చేసుకున్నట్లు ఇన్ డైరెక్ట్ గా ప్రకటించింది. మరోవైపు త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారని, సరోగసి ద్వారా వేరు పిల్లల్ని కనాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా ఇప్పుడు నయనతార మరియు విగ్నేష్ పై పోలీస్ కేసు నమోదు అవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ను స్థాపించిన విగ్నేష్ మరియు నయనతార లను అరెస్ట్ చేయాలంటూ తమిళనాడుకి చెందిన ఒక సోషలిస్ట్ కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం తమిళనాడులోని రౌడీలను అణిచివేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సమయంలో నయనతార మరియు విగ్నేష్ లు తమ నిర్మాణ సంస్థకు రౌడీ పిక్చర్స్ అని పేరు పెట్టి రౌడీలను ప్రోత్సహించే లాగా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు కణ్ణన్. మొన్నటిదాకా చిన్న సినిమాలను నిర్మించిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ ఇప్పుడు అజిత్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో పోలీస్ కేస్ అవ్వడం అభిమానులను కలవరపరుస్తోంది.

Shireesha

Shireesha

Next Story