Ravi Teja's Mother: రవితేజ తల్లిపై పోలీస్ కేస్

Ravi Teja's Mother: :మాస్ మహారాజా రవితేజ తల్లిపై కేసు నమోదు అయింది.

admin1
Updated on: 22 Jan 2022 3:01 PM IST
Police case against Ravi Teja
X

 రవితేజ తల్లిపై పోలీస్ కేస్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ తల్లిపై కేసు నమోదు అయింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద పుష్కర కాల్వ ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో రవితేజ తల్లి లక్ష్మి మరియు మరోకరిపై ఒక పోలీసు కేసు నమోదయ్యింది. సర్వేనెంబర్ 108 మరియు 124 లో ప్రకారం పుష్కర కాల్వ ను అక్రమంగా కూల్చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ విషయం గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రవితేజ పేరు వార్తలు బాగానే వినిపిస్తోంది.

మొన్న బాలకృష్ణ టాక్ షో కి వచ్చినప్పుడు తన షాకింగ్ కామెంట్లతో అందరి దృష్టిని ఆకర్షించి వార్తలకెక్కిన రవితేజ పేరు ఇప్పుడు మళ్ళీ తన వ్యక్తిగత జీవితం వల్ల మరొకసారి అందరి నోట్లో నానుతోంది. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ త్వరలో "ఖిలాడి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక మరోవైపు రామారావు డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో కూడా రవితేజ చాలా బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story