Tollywood: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన టాలీవుడ్ నటి

Tollywood: 'బుర్రకథ' హీరోయిన్ నైరాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలసి డ్రగ్స్ తీసుకుంటూ ముంబైలో పట్టుబడింది.

Kranthi
Published on: 16 Jun 2021 8:06 AM IST
Police Arrests Tollywood Actress Naira Shah in Mumbai
X

Tollywood Actress Naira Shah:(File Image)

Tollywood: డ్రగ్స్ కల్చర్ నుంచి సినిమా ఇండస్ట్రీ కొత్త జనరేషన్ బయటపడలేకపోతుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టించిందో చూశాం. అలాగే సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాల్లోనూ డ్రగ్స్ కు ఎంతమంది ఎలా బానిసలుగా మారారో కూడా బయటపడ్డాయి. శాండిల్ వుడ్ సైతం డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కుంది. ఇప్పుడు లేటెస్టుగా టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ముంబై నటి నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది.

నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం మరింత కలకలం రేపుతోంది. 'బుర్రకథ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ నైరా షా ముంబయిలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాదకద్రవ్యాలు ఉపయోగిస్తూ దొరికిపోయింది. నైరా షా తన పుట్టినరోజు సందర్భంగా జుహూ ప్రాంతంలోని ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. తన స్నేహితుడు ఆషిక్ ఎస్ హుస్సేన్ తో కలిసి పార్టీ చేసుకుంది. అయితే, నార్కొటిక్స్ విభాగం అధికారులు వెళ్లే సమయానికి నైరా షా, ఆషిక్ హుస్సేన్ గంజాయి నింపిన సిగరెట్లు తాగుతూ దర్శనిమిచ్చారు.

పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లోనూ నైరా షా, ఆషిక్ హుస్సేన్ మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2019లో వచ్చిన బుర్రకథ చిత్రంలో ఆది హీరో కాగా, నైరా షా కూడా నటించింది. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడు.

Kranthi

Kranthi

Next Story