Mahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..

Pokiri Special Shows: తెలుగు సినిమా చరిత్రలోనే "పోకిరి" ను ఒక ఐకానిక్ సినిమాగా చెప్పుకోవచ్చు.

Arun Chilukuri
Updated on: 11 Aug 2022 7:00 PM IST
Pokiri Special Shows Creats Massive Records
X

Mahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..

Pokiri Special Shows: తెలుగు సినిమా చరిత్రలోనే "పోకిరి" ను ఒక ఐకానిక్ సినిమాగా చెప్పుకోవచ్చు. మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్ లు, అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మనసులలో గుర్తుండిపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రన్నయింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మళ్లీ "పోకిరి" సినిమాకి థియేటర్లలో స్పెషల్ షోలు వేయించారు.

ఇన్నాళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లోకి వచ్చారు. తాజాగా స్పెషల్ షోస్ కు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేయడంతో ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. కేవలం సినిమా స్పెషల్ షోస్ ద్వారానే 1.5 కోట్లు నమోదు చేసుకుంది. దీంతోనే రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా 375 పైగా షోలు వేయడంతో మరొక రికార్డుని నమోదు చేసుకుంది.

ఆసక్తికరంగా 80% కంటే ఎక్కువ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. చాలామంది అభిమానులు టికెట్లు బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడంతో ఎక్స్ట్రా షో లు కూడా యాడ్ చేయడం జరిగింది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ సూపర్ సక్సెస్ తో మరింత సంతోషంగా ఉన్నారు. అయితే మరోవైపు మిగతా హీరోల అభిమానులు మాత్రం నెంబర్లు చూసి ఖంగు తిన్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story