RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్..

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 18 Jan 2022 1:46 PM IST
Petition Filed in the High Court Against RRR Movie
X

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్..

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా ద్వారా చరిత్ర కథలను వక్రీకరిస్తున్నారని కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీపై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారని అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆరోపించారు.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీసుగా చూపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సినిమా మేకర్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లూరి, కొమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదన్నారు. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని పడాల డిమాండ్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పటికీ కలవని ఇద్దరూ వీరుల మధ్య స్నేహాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా..ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో సినిమాను వాయిదా వేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై వరుస కోర్టు కేసులు తలనొప్పిగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story