Perni Nani - Pawan Kalyan: పవన్‌ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్

* ఏపీలో సుమారు 1100 థియేటర్లు ఉన్నాయి -పేర్ని నాని * 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి -పేర్ని నాని

Arun Chilukuri
Updated on: 26 Sept 2021 8:30 PM IST
Perni Nani Counter on Pawan Kalyan Comments on AP CM Jagan and Ministers | Telugu Online News
X

పేర్ని నాని (ఫోటో - ది హన్స్ ఇండియా)

Perni Nani-Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏపీలో థియేటర్లను ప్రభుత్వం మూయించిందని పవన్‌ అంటున్నారని, ఏపీలో సుమారు 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని చెప్పారు పేర్ని నాని.

తెలంగాణలో కేవలం 413 థియేటర్లలోనే సినిమాలు ఆడుతున్నాయన్నారు. అలాగే నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తుందని స్పష్టం చేశారు. రిపబ్లిక్‌ ఇండియా కాబట్టే మీరు ఏమన్నా చెలామణి అవుతోందన్నారు. కోడి కత్తి కేసు ఎన్‌ఐఏ చూస్తోంది. దమ్ముంటే కోడికత్తి కేసుపై కేంద్రాన్ని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించాలన్నారు పేర్ని నాని.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story