Rashmika: పునీత్ రాజ్ కుమార్ విషయంలో రష్మిక ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Rashmika: మరొకసారి రష్మిక ప్రయత్నం విఫలమైందా?

R Tripura Malini
Updated on: 23 Dec 2022 8:30 PM IST
People Are Trolling Rashmika About Puneeth Rajkumar
X

పునీత్ రాజ్ కుమార్ విషయంలో రష్మిక ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Rashmika: కన్నడలో "కిరీక్ పార్టీ" అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఆ తర్వాత "గీత గోవిందం" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అయితే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ను ప్రేమించిన రష్మిక అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది కానీ నిశ్చితార్థం అయిపోయిన కొన్ని రోజులకి వారు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటు టాలీవుడ్ లో ఫేమ్ రావడంతో రష్మిక రక్షిత్ ను వదిలేసిందని పుకార్లు కూడా వినిపిస్తూ ఉంటాయి.

ఏదేమైనా కన్నడ ప్రేక్షకులు మాత్రం గత కొంతకాలంగా రష్మిక మందన్న ను విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా "కాంతారా" సినిమాని చూడలేదని రష్మిక చెప్పడంతో కన్నడిగులు ఆమెపై మరింత కోపాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈమెను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. కానీ రష్మిక మాత్రం ఎలాగైనా కన్నడ ప్రేక్షకుల మన్ననల ను పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కన్నడ దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసింది. పునీత్ రాజ్ కుమార్ సరసన రష్మిక "అంజనీపుత్ర" అనే సినిమాలో నటించింది. "సినిమా సమయంలో పునీత్ సర్ తో మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆయన ఒక అద్భుతమైన నటుడు" అంటూ ట్వీట్ చేసింది రష్మిక. అయితే ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. అందుకే కన్నడ ప్రేక్షకులు కూడా ఈమె సినిమాలను ఆదరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రష్మిక కన్నడ ప్రేక్షకులను శాంతపరిచేందుకు ఇలాంటి పోస్ట్ లు చేస్తోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈమెపై ట్రోలింగ్ మరింత పెరిగింది కానీ తగ్గలేదు.

R Tripura Malini

R Tripura Malini

Next Story