Pelli SandaD: శ్రీలీల రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Pelli SandaD: ఈ మధ్యనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా విడుదలైన "పెళ్లిసందడి" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీ లీల.

admin1
Updated on: 25 Jan 2022 5:31 PM IST
Pelli Sandadi Heroine Sree Leela Demands Huge Remuneration
X

Pelli SandaD: శ్రీలీల రెమ్యునరేష్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Pelli SandaD: ఈ మధ్యనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా విడుదలైన "పెళ్లిసందడి" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీ లీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె ఇప్పుడు వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ లో బాగానే ముందుకు దూసుకుపోతోంది. శ్రీ లీల మీద ఇప్పుడు దర్శకనిర్మాతలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకుని, తన అందం మరియు అభినయంతో చాలా బాగా ఆకట్టుకుంటోంది. దీంతో శ్రీ లీల కి ఆఫర్లు బాగానే వచ్చి పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ కూడా ఈ భామ బాగా పెంచినట్లగా తెలుస్తోంది. మొదటి సినిమాకి 30 నుంచి 50 లక్షల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీ లీల ఇప్పుడు మాత్రం తన తదుపరి సినిమాల కోసం ఏకంగా కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమాల బాట పట్టారు. దీంతో కృతి శెట్టి, శ్రీలీల వంటి హీరోయిన్లు మామూలుగా సినిమాలకి బెస్ట్ ఆప్షన్ లు గా మారార్. తాజాగా శ్రీ లీల ఇప్పుడు రవితేజ, వైష్ణవ్ తేజ్ వంటి వారితో రొమాన్స్ చేసే అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమా ఆఫర్ కూడా ఈమెకు అందినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story