Pelli SandaD Movie: పెళ్లి సందD హంగామా షురూ.. సాంగ్ రిలీజ్

Pelli SandaD Movie: రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి సందడి' అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమాగా నిలిచింది.

Samba Siva Rao
Published on: 28 April 2021 6:58 PM IST
Pelli SandaD Movie Premantey Enti Song Released on April 28
X

పెళ్లిసందD మూవీ ( ఫైల్ ఫోటో ) 

Pelli SandaD Movie: శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'పెళ్లి సందడి'. అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమాగా నిలిచింది. కీరవాణి బాణీలు మ్యూజిక్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 25 ఏళ్ల క్రిందట విడుదలైన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కాలర్ ట్యూన్స్ గా సెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడ్రన్ పెళ్లి సందD సినిమా అనౌన్స్ చేసి ఆసక్తి రేకెత్తించిన దర్శకేంద్రుడు.. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్ర రావుకి ఏప్రిల్ 28వ తేదీతో ఉన్న సెంటిమెంట్ కారణంగా ఈ రోజే పెళ్లి సందD హంగామా షురూ చేశారు. 'ప్రేమంటే ఏంటి' అంటూ సాగిపోతున్న ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాయగా హరి చరణ్, శ్వేతా పండిట్ ఆలపించారు. మరోసారి కీరవాణి తన మ్యూజిక్‌తో పాటకు ప్రాణం పోశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాటి 'పెళ్లి సందడి'కి సిక్వెల్ చిత్రం కాదని రాఘవేంద్రరావు ముందే చెప్పారు. మొత్తం మీద ఈ పెళ్లి సందD, ఆ పెళ్లి సందడిలా అందరి అలరిస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే


Samba Siva Rao

Samba Siva Rao

Next Story