Dhamaka Movie: మాస్ మహారాజా రవితేజ సరసన నటించనున్నపెళ్లి సందD హీరోయిన్

*ఈ సినిమాకి భీమ్స సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1
Updated on: 23 Oct 2021 4:01 PM IST
Pelli SandaD Heroine Sreeleela Pair up With Ravi Teja in Dhamaka Movie | Cinema News Today
X

రవితేజ సరసన నటించనున్న శ్రీ లీల(ఫైల్ ఫోటో)

Dhamaka Movie: ఈ ఏడాది మొదట్లో "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు "రామారావు ఆన్ డ్యూటీ" మరియు "ఖిలాడి" సినిమాలు చేతిలో ఉన్నప్పుడే మరోవైపు త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో "ధమాకా" సినిమాని ప్రకటించి కొబ్బరికాయ కూడా కొట్టేసారు రవి తేజ.

అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేసి అందరూ అవాక్కయ్యేలా చేశారు రవితేజ. ఒకానొక దశలో వరుస డిజాస్టర్తో సతమతం అయిన రవితేజకు ఇప్పుడు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం శ్రీ లీల ను హీరోయిన్ గా ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యనే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "పెళ్లి సందడి" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది ఈమె. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

కేవలం ఒక్క సినిమాతోనే ఏకంగా మాస్ మహారాజా తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది శ్రీ లీల. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకి భీమ్స సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story