Payal Rajput: అమ్మాయి పీరియడ్స్ అంటూ ఫొటో పెట్టేసిన పాయల్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Published on: 25 March 2021 3:33 PM IST
Paayal Rajput Post Goes Viral
X

పాయల్ ఇమేజ్ సోర్స్ ఇస్టాగ్రామ్

Payal Rajput: సృష్టికి మూలం మహిళలే అటువంటి స్త్రీల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అమ్మాయి జీవితంలో చెప్పుకోలేని సందర్భాలుంటాయి. ప్రతి మహిళకు నెలసరి సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. బాల్యం నుంచి యుక్త వయసుకు చేరుకునే సమయంలో ప్రతి మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. పీరియడ్స్ విషయం బయటకు చెప్పడంలో ప్రతి అమ్మాయి ఎంతో ఇబ్బంది పడుతారు.

ఆ పీరియడ్స్ డేట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచుతుంటారు లేడీస్. పాయల్ రాజ్‌పుత్ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. ఓ అమ్మాయి పబ్లిక్ ప్లేస్‌లో పీరియడ్స్ కావడం, దానిపై పక్కనే ఉన్న ఓ యువకుడు స్పందించిన తీరుపై పాయల్ పోస్ట్ చేసింది. తన కూతురు ఓ పబ్లిక్ బస్‌లో ప్రయాణిస్తుండగా మొదటిసారి పీరియడ్స్ జరిగాయని, దాంతో ప్యాంటుపై రక్తపు మరకలు పడటం చూసి పక్కనే ఉన్న ఆమెకంటే పెద్దవాడైన ఓ కుర్రాడు ఆ విషయాన్ని చెప్పి.. తన స్వెటర్ ఇచ్చిమరీ అది నడుముకు చుట్టుకొని ఇంటికి వెళ్ళమని తన కూతురుతో చెప్పాడంటూ ఓ తండ్రి ఇచ్చిన వివరణ ఆ ఫొటోపై రాసి ఉంది.


పాయల్ ఆ ఫొటో, మెసేజ్‌ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసి అతనికి ధన్యవాదలు తెలిపింది. ఆ కుర్రాడు స్పందించిన విధానం బాగుందని క్లాప్స్ కొట్టింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పాయల్ పెట్టిన ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ తర్వాత వెంకటేష్‌-నాగ చైతన్యతో కలిసి 'వెంకీమామ' చిత్రంలో నటించింది. తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌కి తన ఎంతో క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story