బాలయ్య తో పాయల్ రాజ్‌పుత్

బాలయ్య తో పాయల్ రాజ్‌పుత్
x
Highlights

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరు పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 సినిమా తో అరంగేట్రం చేసిన పాయల్ విపరీతం గా ఆఫర్స్...

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరు పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 సినిమా తో అరంగేట్రం చేసిన పాయల్ విపరీతం గా ఆఫర్స్ వచ్చినా కానీ పెద్దగా ఒప్పుకోలేదు. చేయాల్సిన సినిమాల గురించి ఆచి తూచి అడుగులు వేస్తూ వచ్చింది. యువ హీరోల తో సినిమా లు చేస్తుంది అనుకుంటే, అందరినీ ఆశ్చర్య పరుస్తూ రవి తేజ తో డిస్కో రాజా సినిమా ఒప్పుకుంది. ఆ తర్వాత అనూహ్యం గా సీత సినిమా లో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంది.

ఇదిలా ఉంటె ఈ మధ్య మళ్ళి వెంకీ మామ సినిమా లో కూడా వెంకటేష్ సరసన సినిమా ఒప్పుకుంది. ఆ మధ్య మన్మధుడు 2 లో కూడా నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదు అని తేలిపోయింది. ఇక పోతే ఇప్పుడు బాలకృష్ణ సరసన కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో కూడా రూలర్ అనే చిత్రాన్ని కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంతకు ముందు బాలయ్య తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు లో జయసుధ లా మెరిసింది పాయల్. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఈ సినిమా లో సందడి చేయనున్నారు. అయితే ఈ సినిమా లో మరో హీరోయిన్ పాత్ర కి హరిప్రియ ని తీసుకున్నట్లు సమాచారం. దీని పై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories