Big Boss 5 Telugu: బిగ్‌బాస్‌ వార్తలపై స్పందించిన ఆర్‌ఎక్స్‌ బ్యూటీ

Big Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Venkata Chari
Updated on: 10 Jun 2021 8:00 PM IST
Payal Rajput Says That News Is Fake
X

పాయల్ రాజ్‌పుత్ (ఫొటో ట్విట్టర్)

Big Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సీజన్‌లో పాయల్ రాజ్‌పుత్ పాల్గొంటుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ వార్తలపై ఆర్‌ఎక్స్‌ బ్యూటీ స్పందించింది. ట్విటర్‌ లో ఈ మేరకు సమాధానం ఇచ్చింది. తాను తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. తనపై వస్తున్న వార్తలన్నీ నిజాలు కాదని.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి నన్ను లాగొద్దని పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. మొత్తానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌లో పాయల్ ఎంట్రీ లేదని తెలిసింది.

Venkata Chari

Venkata Chari

Next Story