Payal Rajput: ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన పాయల్ రాజ్ పుత్

"వేరే స్త్రీలలో లేనిది నా దగ్గర ఏముంది?" అని ప్రశ్నిస్తున్న పాయల్ రాజ్ పుత్

admin1
Updated on: 7 Dec 2021 11:15 AM IST
Payal Rajput Reacts Strongly to Trolls Photos
X

ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన పాయల్ రాజ్ పుత్ (ఫైల్-ఫోటో)

Payal Rajput: "ఆర్ఎక్స్ 100" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక "వెంకీ మామ", "డిస్కో రాజా" వంటి సినిమాలు లో నటించిన పాయల్ రాజ్ పుత్ తాజాగా ఒక ఫోటో షూట్లో పాల్గొంది. కానీ అక్కడ ఆమెకి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో ఆమె కోటు పక్కకి తప్పుకోవటంతో ఆమె అందాలు కాస్త బయటపడ్డాయి. ఇక నెటిజన్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీని గురించి చాలా కాలం మౌనం వహించింది పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈ మధ్యనే తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడింది.

"కొన్ని రోజులపాటు నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి భయపడ్డాను. ఇంటర్నెట్లో లీక్ అయిన నా వీడియో మీద అందరూ చీప్ కామెంట్లు చేశారు. నేను చాలా ఎమోషనల్ పర్సన్ ని. ఇలా నాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవడంతో నేను కలత చెందాను. నా కుటుంబం కూడా బాధపడింది. మా అమ్మ అయితే నాకు ఫోన్ చేసి అన్నీ వదిలేసి వచ్చేయ్ అని చెప్పింది. కానీ నేను వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పాను. నేను ఏదో కావాలని చేసినట్లు అది నేరం లాగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇతర స్త్రీల లో లేనిది నా దగ్గర ఏముంది? అని ఆశ్చర్యపోయాను" అని చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.

admin1

admin1

Next Story