లిప్ లాక్ తో వివాదాల్లో పడ్డ "ఆర్‌ఎక్స్ 100" బ్యూటీ

Payal Rajput: "ఆర్ఎక్స్ 100" వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్

Arun Chilukuri
Updated on: 23 May 2022 8:45 PM IST
Payal Rajput Lip Lock With Saurabh Dhingra
X

లిప్ లాక్ తో వివాదాల్లో పడ్డ "ఆర్‌ఎక్స్ 100" బ్యూటీ 

Payal Rajput: "ఆర్ఎక్స్ 100" వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ అందులో ఒకటి కూడా ఈమెకు మంచి హిట్ ను ఇవ్వలేకపోయాయి. అయితే సినిమాల పరంగా సైలెంట్ గానే ఉన్న పాయల్ రాజ్ పుత్ తాజాగా అందాల ఆరబోత తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కేవలం ఒక బ్లేజర్ ను ధరించి తాజాగా ఈ భామ ఒక ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఒక వీడియో లో చూపించ కూడని అందాలను కూడా చూపించేసింది ఈ భామ.

దీంతో తప్పు తెలుసుకుని వెంటనే ఆ వీడియో ని డిలీట్ చేసింది కానీ ఈలోపే ఆ వీడియో వైరల్ అయింది. ఇక తాజాగా పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడు సౌరబ్ దింగ్రా కి లిప్ కిస్ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. జీ తెలుగు వారు నిర్వహిస్తున్న జీ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డాన్స్ చేసిన పయల్ ను యాంకర్ శ్రీముఖి వారి మధ్య ఏదో ఉంది కదా అని అడగగా సిగ్గు పడిన పాయల్ అతని పెదాలపై ముద్దు పెట్టేసింది. ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రం ఇలాంటివి పబ్లిక్ ప్రైవేట్ గా చేస్తేనే బాగుంటాయి అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story