Ravi Teja New Movie: అనసూయ స్థానంలో వినిపిస్తున్న పాయల్ రాజ్ పుత్ పేరు

Payal Rajput Item Song in Ravi Teja New Movie Dhamaka | Today Cinema News
x

రవితేజ సినిమాలో మరొకసారి 'ఆర్ఎక్స్100' బ్యూటీ (ఫైల్ ఫోటో)

Highlights

Payal Rajput Item Song: రవితేజ సినిమాలో మరొకసారి 'ఆర్ఎక్స్100' బ్యూటీ

Ravi Teja New Movie - Payal Rajput Item Song: వరుస డిసాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ "క్రాక్" సినిమాతో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోరుతో మరొక సినిమాని లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ సినిమాకి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ధమాకా" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్లు గా వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా ఈ పుకార్ల పై స్పందించిన చిత్రబృందం ఇందులో నిజం లేదని కొట్టిపారేసింది. తాజాగా ఇప్పుడు "ఆర్ ఎక్స్ 100" బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేయబోతున్నట్లు మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లు నిజమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

రవితేజ ఈమధ్యనే హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. నిజానికి త్రినాథరావు నక్కిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ తో తీయాలని అనుకున్నారు కానీ వెంకీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాని రవితేజకి వినిపించగా, రవితేజ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories