Payal Rajput: ఆ అబద్ధం నిజమైతే బాగుండు.. పాయల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Payal Rajput: ఆ అబద్ధం నిజమైతే బాగుండు.. పాయల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Payal Rajput: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్ రాజ్‌పుత్.
Payal Rajput: ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలిసినిమాలోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ చిన్నది. నెగిటివ్ రోల్‌లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆపై వరుసగా బడా అవకాశాలు దక్కించుకున్న పాయల్ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి హిట్‌ను ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం మూవీతో మరోసారి బ్లాక్ బ్లస్టర్‌ను సొంతం చేసుకుంది.
ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే ఈ చిన్నది తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకల్లో పాల్గొంది. ఈ వేడుకలో పాల్గొన్న పాయల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇప్పటి వరకు మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్ ఏంటి.? అని ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభాస్‌తో నా పెళ్లి అయ్యిందటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నాని, అది నిజమైతే బాగుండని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది పాయల్.
ఇక తన జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారన్నన అడగ్గా.. తనకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నాని చెప్పుకొచ్చింది. చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నానని, వాళ్లంతా తనపై చూపించే ప్రేమాభిమానాల వల్ల జీవితం మరింత అందంగా మారిందని చెప్పుకొచ్చింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



