Bigg Boss 5: బిగ్ బాస్ 5 తెలుగులో పాయల్ రాజ్‌పుత్?

Payal Rajput in Bigg Boss 5 Telugu?
x
పాయల్ రాజ్‌పుత్ (ఫొటో ట్విట్టర్)
Highlights

Bigg Boss 5: తెలుగులో ప్రతిభావంతులైన హీరోయిన్‌లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు.

Bigg Boss 5: తెలుగులో ప్రతిభావంతులైన హీరోయిన్‌లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డ్ ఫిల్మ్ 'ఆర్ఎక్స్ 100' తో ఆమె అరంగేట్రం చేసినప్పటికీ, చిత్రనిర్మాతల దృష్టిని ఆకర్షించడంలో ఈ బ్యూటీ విఫలమైంది.

రవితేజ, వెంకటేష్‌ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. కానీ, అవికూడా తన కెరీర్‌కు ఎలాంటి మార్పును చూపించలేకపోయాయి. అయితే తాజాగా ఈ ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పై ఓ వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. త్వరలో తెలుగులో మొదలయ్యే బిగ్‌బాస్‌ 5 లో పాల్గొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు బిగ్‌బాస్‌ మేకర్స్ పాయల్ రాజ్‌పుత్ సంప్రదించారంట. అయితే, ఈ బ్యూటీ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. మరి అధికారిక వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

పాయల్ ప్రస్తుతం పంజాబీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే పలు తెలుగు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. మరి బిగ్‌బాస్‌ అయిన తనకు మరిన్ని అవకాశాలను అందిస్తుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories