Top
logo

పవర్ స్టార్ న్యూలుక్ .. వైరల్

పవర్ స్టార్ న్యూలుక్ .. వైరల్
X

పవన్ కళ్యాణ్ న్యూలుక్ 

Highlights

వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావడంతో ఆయన కొత్త సినిమా షూటింగ్ కి సిద్ధం అయ్యారు.

రాజకీయాల బిజీలో చాలాకాలంగా పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక తరువాత ఆయన వరుసగా క్రిష్ దర్శకత్వంలో ఓ చారిత్రాత్మక చిత్రం, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' రీమేక్ పట్టాలెక్కిస్తున్నారు.

ఇప్పడు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావడంతో ఆయన కొత్త సినిమా షూటింగ్ కి సిద్ధం అయ్యారు. సితార ఎంటర్తిన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో టాలీవుడ్ కథానాయకుడు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ భళ్లలదేవుడు రానా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ప‌వ‌న్, రానా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందిస్తాయ‌ని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ అభిమానులు న్యూ లుక్ చూసి తెగమురిసి పోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు 'బిల్లా రంగా' టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం.

కాగా.. దర్శకుడు క్రిష్ కూడా పవన్ తాజా చిత్రం గురించి మంగళవారం ఓ ఆనౌన్స్ మెంట్ చేశారు. పవన్ ౨౭వ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు పెట్టారు. క్రిష్‌ ఈ సినిమాను'పీఎస్‌పీకే27' అంటూ సెట్స్‌లో బిజీగా ఉన్నఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పిరియాడికల్‌ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను 'విరుపాక్ష' పేరుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లోకేషన్‌కు సంబంధించిన ఫొటోలను దర్శకుడు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.


Web TitlePawan Kalyan New Look Viral
Next Story