Pawan Kalyan in Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్‌

Arun Chilukuri
Updated on: 5 Nov 2020 4:29 PM IST
Pawan Kalyan in Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్‌
X

Pawan Kalyan in Hyderabad Metro : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ కోసం మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోలో వెళ్లారు పవన్‌. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో వెళ్లిన పవన్ కళ్యాణ్‌.. అమీర్‌పేట్‌లో ట్రైన్ మారే సమయంలో తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. మియాపూర్‌ వెళ్లే సమయంలో తన పక్కన కూర్చున్న ద్రాక్షారామంకు చెందిన రైతుతో మాట్లాడారు పవన్‌. పంటల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. మెట్రోలో పవన్‌ కళ్యాణ్ తో పాటు నిర్మాత దిల్‌రాజు కూడా ప్రయాణించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story