Vakeel Saab Promotional Song: స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌తో పవర్ స్టార్ సందడి

Pawan to feature in Vakeel Saab Promotional song
x

వకీల్ సాబ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Vakeel Saab Promotional song: పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలా హోప్స్ ఉన్నాయి.

Vakeel Saab Promotional song: పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలా హోప్స్ ఉన్నాయి. చాలా కాలం తరువాత పవర్ స్టార్ హీరోగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ న్యాయవాదిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అంజలి, అనన్య నాగల్లా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే తమన్ అందించిన ఆడియో ఆల్బమ్ విజయవంతమైంది. మొత్తం మూడు పాటలు ఉన్నాయని, అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్ పేర్కొన్నారు. తాజా సమాచారం మేరకు, ఈ నెల 4 న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఈ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌ను ఆవిష్కరించాలని తమన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమోషనల్ సాంగ్‌లో పవన్ కల్యాణ్ సందడి చేయనున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు కాంబోలో నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 9 న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories