Vakeel Saab Twitter Review: బొమ్మ బ్లాక్ బస్టర్; ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సేనంట

Vakeel Saab Twitter Review: పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్‌' గా నేడు (ఏప్రిల్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Venkata Chari
Updated on: 9 April 2021 6:53 AM IST
Pawan kalyans Vakeel Saab Movie Is Block Bustter Says Twitter Reviews
X

వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)

Vakeel Saab Twitter Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 3 సంవత్సరాల తర్వాత 'వకీల్ సాబ్‌' గా నేడు (ఏప్రిల్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇండియాలో కంటే ముందు యూఎస్‌లో గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. వీటికి పాజిటివ్ టాక్ ఇచ్చారు నెటిజన్స్. ఈమేరకు సినిమా చూస్తూ.. సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేశారు. ఆ ట్వీట్స్ మీకోసం..

పవన్ తన నటనతో చింపేశాడంట..

వకీల్ సాబ్ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉందంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. పవర్‌ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడని, కోర్టు సీన్లలో దుమ్మురేపాడని అంటున్నారు. యాక్షన్ సీన్స్ మరో లెవెల్‌లో ఉన్నాయంట. వేణు శ్రీరాం సినిమా కథను అద్భుతంగా తెరకెక్కించాడు. థమన్ మ్యూజిక్, బీజీఎం ఎక్ట్రార్డినరీ గా ఉన్నాయంట అని ఓ నెటిజన్ ట్విట్ చేశాడు.

కెరీర్‌లోనే బెస్ట్

పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్‌'గా తనదైన శైలిలో పండించారు. సినిమాను కంప్లీట్‌గా ఓన్ చేసుకొన్నాడు. పవర్ స్టార్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా వకీల్ సాబ్. కోర్టు సీన్లలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంది. బీజీఎం నెక్ట్స్ లెవెల్ హిట్ అంటూ మరో నెటిజన్ వెల్లడించాడు.

మ్యాజిక్ చేసిన పవర్ స్టార్

పవన్ కల్యాణ్‌కు ఇంతకంటే గొప్ప కమ్ బ్యాక్ మూవీ రాదు. సినిమా చూసిన తర్వాత మాటలు రావడం లేదంటే.. సినిమా ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్రో సీన్స్ చూస్తే రోమాలు నిక్కబోడుచుకుంటాయని ఇంకో నెటిజన్ వెల్లడించాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్

వకీల్ సాబ్ ఫస్ట్ హాఫ్ ఫినీష్ అయింది. మూడేళ్లుగా పవన్ కల్యాణ్‌ను ఎంత మిస్ అయ్యామో అనే విషయం 'వకీల్ సాబ్' చూస్తే తెలుస్తుంది. వేణు శ్రీరాం డైరెక్షన్ తో మాయ చేశాడు. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా కమర్షియల్ ఎలిమింట్స్ అద్బుతంగా పండించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్.. కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే ప్రత్యేకం అంటూ మరో కామెంట్.

కోర్టు సీన్లు సూపర్బ్

సెకండాఫ్ బ్లాక్ బస్టర్‌గా రేంజ్ లో ఉంది. కోర్టు సీన్లు సినిమాకు ఆయువు పట్టు. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ గ్రాండ్ గా ఉంది. వన్ లైనర్ డైలాగ్స్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్ని బాగా ఉన్నాయి. పీకే ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంది. ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ మరికొంత మంది ఫ్యాన్స్ పేర్కొన్నారు.

మొత్తానికి వకీల్ సాబ్ గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయినట్లేనని తెలుస్తోంది. ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో.. ఇక బాక్సాఫీస్ రికార్డులపై కన్నేశారు ఫ్యాన్స్. మరి కొద్ది సేపట్లో పూర్తి రివ్యూతో మీ ముందుంటాం.

Venkata Chari

Venkata Chari

Next Story