Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్పుడే ఉంటుందా?

Pawan Kalyan Unstoppable Episode will Streaming IN February
x

Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్పుడే ఉంటుందా?

Highlights

Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్పుడే ఉంటుందా?

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కి కూడా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి సీజన్ 1 పెద్ద హిట్ అయినప్పటికీ సీజన్ 2 మొదలైనప్పుడు అంత క్రేజ్ రాలేదు. అయితే గత కొద్ది రోజులుగా అన్ స్టాపబుల్ కి వస్తున్న గెస్ట్ ల వల్ల షో కి ఉన్న పాపులారిటీ మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా బాహుబలి స్టార్ ప్రభాస్ రాకతో అన్ స్టాపబుల్ కి ఉన్న క్రేజ్ రెట్టింపు అయింది అని చెప్పుకోవచ్చు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మొదటి భాగం ఇప్పటికే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లో రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత అభిమానులందరూ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఎపిసోడ్ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ ఫిబ్రవరిలోనే టెలికాస్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల మొత్తం ప్రభాస్ ఎపిసోడ్ లని ట్రెండింగ్ లోకి తెచ్చి ఆ తరువాత మాత్రమే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై దృష్టి పెట్టనున్నారు అని తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత బాలకృష్ణ ఈ సీజన్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారట. ఈలోగా ప్రభాస్ ఎపిసోడ్ కాకుండా మరొక రెండు ఎపిసోడ్లు వచ్చే అవకాశం ఉంది. సీజన్ 1 లాగానే సీజన్ 2 కూడా మంచి హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆహా మరియు బాలకృష్ణ మరిన్ని సీజన్లతో ప్రేక్షకుల ముందుకి వస్తారని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories