BRO Movie: “బ్రో” సినిమాకి వచ్చిన అకీరా..‘జూనియర్ పవన్’ అంటూ ఫ్యాన్స్ రచ్చ..

Bro Movie: పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బ్రో’ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

Arun Chilukuri
Updated on: 28 July 2023 4:23 PM IST
Pawan Kalyan Son Akira Nandan Spotted at Sudarshan Theatre
X

Bro Movie: “బ్రో” సినిమాకి వచ్చిన అకీరా..‘జూనియర్ పవన్’ అంటూ ఫ్యాన్స్ రచ్చ..

Bro Movie: పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బ్రో’ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ కళ కనిపించింది. ఆయా థియేటర్ల వద్ద భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి.. అభిమానులు తీన్‌మార్‌ డ్యాన్స్‌లు చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా థియేటర్ వద్ద సందడి చేశాడు.

హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు అకీరా వచ్చాడు. ఒక ఖరీదైన కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ థియేటర్ కి అకీరా ఇచ్చిన ఎంట్రీ మాములుగా లేదు. బ్రో మూవీ ప్రింట్ తో ఉన్న టి షర్ట్ వేసుకొని స్టైలిష్ లుక్స్‌లో అదిరిపోయే కారులో హీరోలా ఎంట్రీ ఇచ్చి అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను పవన్ అభిమానులు.. జూనియర్ పవర్ స్టార్ అంటూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story