పవన్ కళ్యాణ్ ఇంటి పేరుని తీసేసిన అకిరా నందన్

*పవన్ కళ్యాణ్ ఇంటి పేరుని తీసేసిన అకిరా నందన్

Rama Rao
Updated on: 26 May 2022 10:30 AM IST
Pawan Kalyans Son Akira Nandan Removes His Fathers Surname
X

పవన్ కళ్యాణ్ ఇంటి పేరుని తీసేసిన అకిరా నందన్ 

Akira Nandan: నిజానికి స్టార్ కిడ్ లను వారి పేర్లతో కంటే ఇంటి పేర్లతోనే గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ మాత్రం తన ఇంటి పేరును తీసేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కొణిదెల వంటి పెద్ద ఇంటి పేరుని పెట్టుకోకుండా అకీరానందన్ తన తల్లి రేణుదేశాయ్ ఇంటి పేరుని పెట్టుకుని ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వారికి అకీరానందన్ మరియు ఆద్య లు పుట్టిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారు విడిపోయారు. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే పిల్లల కోసం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ మరియు రేణూ దేశాయి కలిసి సమయాన్ని గడుపుతుంటారు. ఈ నేపథ్యంలోనే అకీరానందన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా రేణు దేశాయ్ మరియు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

గ్రాడ్యుయేషన్ వేడుకలో అకీరా పేరు అకీరా నందన్ దేశాయి అని కనిపించింది. ప్రస్తుతం అకీరానందన్ ఉంటుంది రేణుదేశాయ్ తో అయినప్పటికీ తన తండ్రి పవన్ కళ్యాణ్ ఇంటి పేరుని ఉంచుకుంటేనే బాగుండేది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కొణిదల వంటి ఇంటి పేరుని వద్దనుకుని తన తల్లి ఇంటి పేరునే పెట్టుకున్నందుకు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story