OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్‌ వచ్చేసింది

OG Trailer: పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' (OG) ట్రైలర్ విడుదలైంది.

Arun Chilukuri
Published on: 22 Sept 2025 2:38 PM IST
OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్‌ వచ్చేసింది
X

OG Trailer: పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' (OG) ట్రైలర్ విడుదలైంది. ఆదివారం ఉదయమే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించగా, తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ట్రైలర్ హైలైట్స్:

ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన చెప్పే డైలాగ్స్, తమన్ అందించిన అదిరిపోయే నేపథ్య సంగీతం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే అనిపిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story