OG: ఓజీ ఖాతాలో మరో రికార్డ్?

OG: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 7:00 PM IST
ఓజీ ఖాతాలో మరో రికార్డ్?
X

ఓజీ ఖాతాలో మరో రికార్డ్?

OG: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికీ టాప్ చార్ట్‌ల్లో ఉన్నాయి. ఇప్పుడు స్పాటిఫై 2025 టాప్ ఆల్బమ్స్ జాబితాలో ఓజీ చేరింది.

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా.. బాక్సాఫీసు దగ్గర పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం పాటలు, బీజీఎం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు స్పాటిఫై 2025 బెస్ట్ ఆల్బమ్స్ జాబితాలో ఓజీ కూడా చేరడం సంచలనంగా మారింది.

సోషల్ మీడియాలో ఈ ఆల్బమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికీ టాప్ చార్ట్‌ల్లో నిలవడం సంచలనంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story